కల్కి భగవాన్ పై వివాదాల దుమారం

కల్కి భగవాన్ ఆశ్రమాల్లో ఆశ్రయం లభించిన భక్తులు మత్తులో ఊగుతూ, స్త్రీపురుష భేదం విస్మరించి ఆలింగనాలు చేసుకోవడం, బట్టలిప్పేసి ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వంటి వీడియో చిత్రాలను ఆ టీవీ చానెళ్లు ప్రసారం చేస్తున్నాయి. కల్కి భగవాన్ దీక్షను తీసుకున్నవారిలో 57 లక్ష మంది దాకా ఉన్నట్లు ఆ టీవీ చానెళ్లు అంచనా వేస్తున్నాయి. వివిధ దర్శనాలు, పూజల పేర్లతో భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నట్లు ఆరోపిస్తున్నాయి. విదేశీయులకు 21 రోజుల ప్రత్యేక ప్యాకేజీ ఉంది. భక్తులకు మాదక ద్రవ్యాలిచ్చి మత్తులో ముంచుతున్నారని కూడా ఆరోపిస్తున్నాయి. దేనికి ఎంత రేటు అనే విషయాలను కూడా టీవీ 9 ప్రసారం చేసింది. విజయకుమార్ అలియాస్ కల్కి కుమారుడు కృష్ణాజీ 3 వేల కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు ఆ చానెల్ ఆరోపించింది.












Click it and Unblock the Notifications