కల్కి భగవాన్ మాయావి: నారాయణ

ఒక్కో యువకుని నుంచి రూ.2000 తీసుకుంటాడని, మహా దశకు చేరాలంటే ఒక్కో సేవకుడు 60 మందిని చేర్పించాలని నిబంధన విధిస్తారని, వారి నుంచి రూ.5000 వసూలు చేస్తారని, ఇలా భక్తిని వ్యాపారంగా మారుస్తున్నారని వివరించారు. ప్రజా ధనాన్ని తన ఆస్తులు పెంచుకునేందుకు ఉపయోగించుకుంటున్నాడని, ఆయన ఆస్తులు ప్రస్తుతం లక్ష కోట్ల వరకు ఉంటాయని ఆయన ఆరోపించారు. దాసాజీల పేరిట సేవకులుగా చేర్చుకుని లక్షల కుటుంబాలను, యువకుల జీవితాలను ఆయన నాశనం చేస్తున్నాడన్నారు. కల్కి భగవాన్ పై తాను మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తానని నారాయణ చెప్పారు. రాష్ట్రమంతటా ఆశ్రమాలు ఏర్పాటు చేస్తానని శిష్యుల పేరిట బినామీగా భూములు తీసుకుంటున్నారని ఆరోపించారు. ప్రస్తుతం కల్కి ఆశ్రమంలో ఉన్న దాసాజీలను బయటికి తీసుకువచ్చి ప్రభుత్వం వారికి కౌన్సెలింగ్ ఇప్పించాలని కోరారు. కల్కి ఆశ్రమంలో హత్యలు కూడా జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications