బ్లాక్ మెయిల్ చేసిన నకిలీ టీవీ విలేకరి అరెస్టు

Krishna Dist
పెనమలూరు(కృష్ణా జిల్లా): జల్సాలకు అలవాటు పడిన ఓ యువకుడు తనకు లభించే జీతం చాలకపోవడంతో అక్రమ సంపాదన వైపు దృష్టి సారించాడు. ఇందుకోసం ఓ టీవీ చానల్‌ విలేకరి అవతారమెత్తాడు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలను బెదిరించి అందినకాడికి దండుకుంటున్నాడు. అతని తీరుపై ఓ ప్రైవేటు స్కూలు ప్రధానోపాధ్యాయురాలికి అనుమానం కలిగింది. వెంటనే ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు పథకం ప్రకారం ఆ నకిలీ విలేకరిని అదుపులోకి తీసుకున్నారు. పెనమలూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. పోలీసుల కథనం ప్రకారం బందరుకు చెందిన నాంచారయ్య(26) నగరంలోని ఓ ప్రైవేటు కార్‌ ట్రావెల్స్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. జల్సాలకు అలవాటుపడిన నాంచారయ్య జీతం సరిపోకపోవడంతో నకిలీ విలేకరి అవతారమెత్తాడు. తన పేరు అంజి అని, తాను ఓ టీవీ చానల్‌ విలేకరి(సాక్షి టీవీ కాదు)నని చెప్పుకుంటున్నాడు.

రెండు వారాల క్రితం కంకిపాడులోని ఓ ప్రైవేటు స్కూలు ప్రధానోపాధ్యాయురాలికి నాంచారయ్య ఫోన్‌ చేసి 'మీ పాఠశాలలో తగిన వసతులు లేవు, 'ఓ ఉపాధ్యాయుడు విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఫిర్యాదులు వస్తున్నాయి', 'టీవీలో స్క్రోలింగ్‌ ఇవ్వమంటారా', 'మీ స్కూలును అల్లరి చేయమంటారా?', 'స్క్రోలింగ్‌ రాకుండా ఉండాలంటే మాకు కొంత సొమ్ము ఇవ్వాలి', 'లేదంటే వచ్చే ఏడాది మీ స్కూలులో ఎవరూ చేరకుండా చేస్తా' అని బెదిరించాడు. భయపడిన ప్రధానోపాధ్యాయురాలు అతనికి రూ. మూడు వేలు ఇచ్చారు.

సోమవారం మళ్లీ ఆ ప్రధానోపాధ్యాయురాలికి ఫోన్‌ చేసి తనకు డబ్బు కావాలని డిమాండ్‌ చేశాడు. అతని తీరుపై అనుమానం వచ్చిన ఆమె స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల సలహా మేరకు ఆమె నాంచారయ్యకు ఫోన్‌ చేసి కావాల్సిన డబ్బులు ఇస్తాను, పోరంకిలోని తమ ఇంటికి వచ్చి తీసుకోవాలని చెప్పారు. మధ్నాహ్నం రెండు గంటల సమయంలో ప్రధానోపాధ్యాయురాలి ఇంటికి చేరుకున్న నాంచారయ్య డబ్బుల కోసం దబాయించడంతో అక్కడే ఉన్న పోలీసులు నింది తుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. తమదైన శైలిలో విచారణ చేయగా గతంలో చేసిన మోసాలను కూడా వెళ్లగక్కాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పెనమలూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+