ఐదేళ్లలో పదిసార్లు పెంపు: కిషన్ రెడ్డి

Kishan Reddy
హైదరాబాద్: గత ఐదేళ్లలో యుపిఎ ప్రభుత్వం పెట్రో ధరలను పదిసార్లు పెంచిందని బిజెపి శాసనసభా పక్ష నాయకుడు జి కిషన్ రెడ్డి విమర్శించారు. పెట్రో ధరల పెంపును నిరసిస్తూ ఆయన మంగళవారం మోటార్ సైకిల్ ను తోసుకుంటూ శాసనసభకు చేరుకున్నారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. పెట్రో ధరల పెంపు వల్ల నిత్యావసర ధరలు అమాంతం పెరుగుతాయని ఆయన అన్నారు. ధరలు తగ్గించకపోతే పెద్ద యెత్తన ఆందోళన చేపడతామని ఆయన అన్నారు.

ఇప్పటికే తమ పార్టీ జాతీయ స్థాయిలో ఇతర పార్టీలతో కలిసి ఉద్యమం చేపడుతోందని ఆయన చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు ధరలు పెరగకున్నా కేంద్ర ప్రభుత్వం పెట్రో ధరలు పెంచిందని ఆయన విమర్శించారు. పెట్రో ధరల పెంపు ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యుడి నడ్డి విరిచే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన అన్నారు. శాసనసభలో తన నిరసనను తెలియజేస్తానని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+