తెలంగాణ శక్తులపై కాంగ్రెసు కుట్ర: కోదండరామ్

Kodandaram
హైదరాబాద్: తెలంగాణ శక్తుల మధ్య అనైక్యత సృష్టించడానికి కాంగ్రెసు పార్టీ ప్రయత్నిస్తోందని తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ (జెఎసి) కన్వీనర్ కోదండరామ్ విమర్శించారు. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల తెలంగాణ ప్రాంత నేతలు తమ వైఖరిని స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వీరు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్, మంత్రి బొత్స సత్యనారాయణల మాదిరిగా తమ వైఖరి తెలపాలని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఈ నెల 4, 5 తేదీల్లో ఇక్కడికి వస్తున్న శ్రీకృష్ణ కమిటీకి తెలంగాణ ప్రజలు నిరసన తెలియజేయాలని ఆయన పిలువునిచ్చారు. నిరసన అంటే కమిటీ దిష్టిబొమ్మలు దగ్ధం చేయడం కాదని ఆయన అన్నారు.

తెలంగాణ ఏర్పడితే తప్ప స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలయ్యే స్థితి లేదని ఆయన అన్నారు. ఉన్నత విద్యా సంస్థల కేటాయింపుల్లో ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తోందని ఆయన విమర్శించారు. శ్రీకృష్ణ కమిటీకి వ్యతిరేకంగా సింగరేణి కార్మికులు చేస్తున్న సమ్మెకు తెలంగాణ ప్రజలంతా మద్దతు పలకాలని ఆయన కోరారు.

ఇదిలావుంటే, ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు మంగళవారం తెలంగాణ అధ్యాపకుల సంఘం ఆందోళనకు దిగింది. తెలంగాణ ప్రాంత విద్యార్థుల పేపర్లను ఈ ప్రాంతంలోనే దిద్దించాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంత విద్యార్థుల పేపర్లను సీమాంధ్ర ప్రాంతంలో దిద్దించడానికి వారు వ్యతిరేకించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో జెఎసి కన్వీనర్ కోదండరామ్, బిజెపి నేత సిహెచ్ విద్యాసాగర రావు, తెరాస నేత కవిత, తెలుగుదేశం శాసనసభ్యుడు దయాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు ఇంటర్ బోర్జు కార్యదర్శి బలరామయ్యతో కలిశారు. నాలుగు రోజుల్లో ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+