కెసిఆర్ కన్నా డిఎస్ గొప్ప: ఎమ్మెల్యేలు

Srinivas
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా ఉన్నప్పుడే ప్రస్తుత ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి శ్రీనివాస్ తెలంగాణ గురించి మాట్లాడారని, శాసనసభలో మూడు గంటలపాటు మాట్లాడారని కాంగ్రెసు తెలంగాణ శాసనసభ్యులన్నారు. శాసనసభ ఆవరణలో కాంగ్రెసు తెలంగాణ శాసనసభ్యులు మంగళవారం డిఎస్ ను కలిశారు. అనంతరం వారు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. డిఎస్ కు వారు పూర్తి బాసటగా నిలిచారు. డిఎస్ తెలంగాణ దీక్షను శంకించాల్సిన అవసరం లేదని కాంగ్రెసు తెలంగాణ శాసనసభ్యుల తరఫున మాట్లాడిన సుధీర్ రెడ్డి అన్నారు. డిఎస్ కన్నా మించిన తెలంగాణవాది మరొకరు లేరని ఆయన అన్నారు.

పిసిసి అధ్యక్షుడైన తర్వాత తాను ప్రథమంగా తెలంగాణవాదినని స్పష్టంగా ప్రకటించుకున్నారని ఆయన గుర్తు చేశారు. పార్టీని సమర్థంగా ముందుకు నడిపిస్తున్నారని ఆయన ప్రశంసించారు. తక్కువగా మాట్లాడి డిఎస్ ఎక్కువగా పని చేస్తారని, తెలంగాణ కోసం డిఎస్ ఎంతో కృషి చేశారని ఆయన అన్నారు. తెలంగాణవాదాన్ని తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి, ప్రధాని మన్మోహన్ సింగ్ డిఎస్ సమర్థంగా వినిపించారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను డిఎస్ అధిష్టానానికి సమర్థంగా వినిపించారని ఆయన అన్నారు. డిఎస్ ను ఎవరు కించపరిచే వ్యాఖ్యలు మానుకోవాలని ఆయన తెలంగాణ నాయకులకు, విద్యార్థులకు, మేధావులకు విజ్ఝప్తి చేశారు. శ్రీకృష్ణ కమిటీ ముందు ప్రజలెవరైనా తమ అభిప్రాయాలను వినిపించవచ్చునని ఆయన అన్నారు. కాంగ్రెసు నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం వస్తుందని నమ్మకం ఉందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+