హైదరాబాద్: హైదరాబాదు సమీపంలోని రాజేంద్రనగర్ లోని ఆచార్య ఎన్టీ రంగా విశ్వవిద్యాలయానికి వస్తున్న రాష్ట్ర గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ ను అడ్డుకునేందుకు తెలంగాణ విద్యార్థులు మంగళవారం ప్రయత్నించారు. వైస్ చాన్సలర్ల సదస్సుకు హాజరు కావడానికి వస్తుండగా ఈ పరిణామం చోటు చేసుకుంది. విసీల సదస్సును అడ్డుకునేందుకు కూడా విద్యార్థులు ప్రయత్నించారు. దీంతో పోలీసులు పది మంది విద్యార్థులను అరెస్టు చేశారు.
స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలుపై ఏర్పాటైన వ్యవసాయ విశ్వవిద్యాలయాల వీసీల సదస్సుకు గవర్నర్ వచ్చారు. విద్యార్థులు జై తెలంగాణ నినాదాలు చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.