భారత్ ను ప్రేమిస్తా, కానీ..: హుస్సేన్

సంఘ్ పరివార్ తనను లక్ష్యంగా ఎంచుకున్నప్పుడు అందరూ మౌనం వహించారని, రాజకీయ నాయకులు, కళాకారులు, మేధావులు ఎవరూ తనకు మద్దతుగా నిలబడలేదని, కానీ 90 శాతం మంది భారత ప్రజలు తనను ప్రేమిస్తారని తనకు తెలుసునని, వారు తనతో ఉన్నారని ఆయన అన్నారు. కొందరు రాజకీయ నాయకులతో పాటు పది శాతం మంది మాత్రమే తనను వ్యతిరేకిస్తున్నారని ఆయన అన్నారు.
భారత ప్రభుత్వాలు తనకు రక్షణ కల్పించలేకపోయాయని, అందువల్ల తాను దేశంలో ఉండలేకపోయానని, రాజకీయ నాయకుల దృష్టంతా ఓట్లపైనే ఉందని ఆయన అన్నారు. ఇప్పుడు వెనక్కి రావాలని తనను అడుగుతున్నారని, తనపై దేశబహిష్కరణ ఉన్నప్పుడు ఎవరూ తనకు మద్దతుగా మాట్లాడలేదని, రాజకీయ నాయకుల మాటలను నమ్మలేమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications