తదుపరి సిఎం జగనే: సినీనటుడు రాజా జోస్యం

Raja
గుంటూరు: కడప ఎంపీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2014 ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని సినీ హీరో రాజా ఆశాభావం వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలు నెరవేర్చగల సత్తా ఉన్న నాయకుడు వైఎస్‌ జగన్‌ మాత్రమేనని చెప్పారు. రాజా గుంటూరులో విలేకరులతో మాట్లాడుతూ ప్రజానేత వైఎస్‌ అనుకున్న లక్ష్యాలను పూర్తి చేసే నాయకుడి కోసం రాష్ట్ర ప్రజలంతా ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఆ నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని, ఆ విషయం ప్రజలు కూడా గుర్తించారని చెప్పారు.

కులమతాలకతీతంగా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఆయన మరణాన్ని తట్టుకోలేక శోకించిన ఘటనను మరువలేనన్నారు. అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు ఎల్‌.ఎం.మోహన్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్‌ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు చేరేందుకు ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త అహర్నిశలు శ్రమించాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ పటిష్టతకు కృషి చేయాలని కోరారు. సమావేశంలో వైఎస్‌ జగన్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ ఏటిగడ్డ నరసింహారెడ్డి (బుజ్జి), ఐఎన్‌టీయూసీ జిల్లా నాయకుడు ఏటిగడ్డ వెంకటప్పారెడ్డి, జిల్లా లేబర్‌ సెల్‌ చైర్మన్‌ సుధాకర్‌రెడ్డి, ఎన్‌ఎస్‌యూఐ జనరల్‌ సెక్రటరీ నర్సారెడ్డి పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+