హైదరాబాద్: నిత్యానంద స్వామి సెక్స్ కుంభకోణంపై హైదరాబాదులోని తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. నిత్యానంద స్వామి ఒక తమిళ నటితో జరిపిన కామక్రీడ తెలుగు చానెళ్లలో కూడా ప్రసారమవుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాదు సమీపంలోని నిత్యానంద స్వామి ఆశ్రమంలో పోలీసులు బుధవారం సోదాలు నిర్వహిస్తున్నారు. శంషాబాద్ గ్రామవాసులు నిత్యానంద స్వామి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆశ్రమం వద్ద స్థానికులు నిరసన తెలియజేశారు. పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు. అశ్రమాన్ని, ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా నిరసన వ్యక్తమవుతోంది.