తెలంగాణ జెఎసికి తెరాస గుడ్ బై?

తెరాస నిర్ణయం మార్పులో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ప్రముఖ పాత్ర పోషించినట్లు చెబుతున్నారు. హోలీ పర్వదినంనాడు కెసిఆర్ నరసింహన్ ను కలిశారు. దీనిపై గవర్నర్ నరసింహన్ కెసిఆర్ తో మాట్లాడినట్లు చెబుతున్నారు. శ్రీకృష్ణ కమిటీని బహిష్కరించే విషయంలో తెలంగాణ జెఎసి కూడా కాస్తా మెత్తబడినట్లు కనిపిస్తోంది. శ్రీకృష్ణ కమిటీ రాక సందర్భంగా నిరసనలు మాత్రమే వ్యక్తం చేయాలని, తమ వ్యతిరేకత కమిటీపై కాదనీ కేంద్ర ప్రభుత్వం మీదనే అనీ జెఎసి కన్వీనర్ కోదండరామ్ అన్నారు. దీన్ని బట్టి శ్రీకృష్ణ కమిటీ ముందు వాదనలు వినిపించడం వైపు మొగ్గు పెరుగుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications