విశాఖపట్నం: షిర్డీ రైలును మరో రెండు నెలలు పొడిగింపునకు రైల్వే అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 0867 నంబర్‌తో విశాఖ నుంచి బయల్దేరే ఈ రైలు ఈ నెల 3, 6, 10, 13, 17, 20, 24, 27, 31, ఏప్రిల్ 3, 7, 10, 14, 17, 21, 24, 28 తేదీల్లో నడుస్తుంది. 0868 నంబర్‌తో షిర్డీ నుంచి ఈ నెల 4, 7, 11, 14, 18, 21, 25, 28, ఏప్రిల్ 1, 4, 8, 11, 15, 18, 22, 25, 29 తేదీల్లో బయల్దేరుతుంది. విశాఖ-నిజామాబాద్-విశాఖ (0865/ 0866) మధ్య ప్రయాణించే నిజామాబాద్ ఎక్స్‌ప్రెస్‌ను కూడా నాలుగు నెలలు పొడిగించారు. విశాఖలో ప్రతి మంగళవారం రాత్రి 7.40 గంటలకు, నిజామాబాద్‌లో ప్రతి బుధవారం సాయంత్రం 6.15 గంటలకు బయల్దేరుతుంది.
నాలుగు నెలల్లో 18 ట్రిప్పులు చొప్పున ఈ రైలు ప్రయాణిస్తుంది. ఈ రెండు రైళ్ల గడువు ఇటీవల ముగియడంతో వాటిని తాజాగా ప్రకటించారు. ముందుగానే ఈ రైళ్లను పొడిగిస్తున్నట్టు సమాచారం ఉన్నా వాల్తేరు సీనియర్ డివిజన ల్ కమర్షియల్ మేనేజర్ హెచ్.ఎల్.లువాంగ్ మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ప్రతి బుధ, శనివారాల్లో విశాఖ నుంచి, గురు, ఆదివారాల్లో షిర్డీ నుంచి నడుస్తుంది.