హైదరాబాద్: హైదరాబాదులోని బోయిన్ పల్లిలో బుధవారం జరిగిన యుద్ధ విమానం సూర్యకిరణ్ ప్రమాదంపై కేసు నమోదైంది. ఎయిర్ యాక్టు కింద బోయిన్ పల్లి పోలీసు స్టేషనులో ఈ కేసును నమోదు చేశారు. హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయంలో ఇండియా ఏవియేషన్ షో 2010 ప్రారంభోత్సం సందర్భంగా విన్యాసాలు చేస్తున్న నాలుగు విమానాల్లో ఓ విమానం బోయిన్ పల్లిలోని జనావాసాల మధ్య కూలిపోయిన విషయం తెలిసిందే.
యుద్ధ విమానం కూలిన ఘటనలో ఇద్దరు పైలట్లు మరణించారు. ఏడుగురు పౌరులు గాయపడ్డారు. శిథిలాల కింద ఓ చిన్నారి, మరో యువకుడి శవాలు బయటపడినట్లు వచ్చిన వార్తలను అధికారులు కొట్టేశారు. ఇద్దరు పైలట్లు మాత్రమే మరణించారని వారు చెప్పారు.