బొత్సను సిఎం చేయండి: దామోదర్ రెడ్డి

శ్రీకృష్ణ కమిటీకి డిసెంబర్ 31 వరకూ కేంద్రం గడువు విధించిందని, ఆ కమిటీ నివేదికతో కేంద్రం తెలంగాణ ఏర్పాటు చేస్తుందని తమకు విశ్వాసం ఉందని, అప్పటికీ నిర్ణయం తీసుకోకపోతే తాము తమ దారి చూసుకుంటామని, ఈ ప్రాంతంలోని కాంగ్రెస్ నేతలంతా బయటకు వస్తారుని టీడీపీ నేతలకూ అది తప్పదని, తెలంగాణ టీడీపీ ఏర్పాటు వారికి అనివార్యమని దామోదర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం వల్లే తాము రాజీనామాలు వద్దనుకొన్నామని చెప్పారు. తెలంగాణ ఏర్పడితే తాను సీఎం కావాలని కోరుకోవట్లేదని, జానారెడ్డి మద్దతు అడిగితే ఇస్తానని ఆయన చెప్పారు. తెలంగాణ జేఏసీ స్వరూపం మార్చి దానిని పార్టీల సమన్వయ సమితిగా పునర్‌వ్యవస్థీకరించనున్నట్లు దామోదర్‌రెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications