రోశయ్య,బాబు తెలంగాణవారే: లగడపాటి

ఉద్యమం కోసం పదవులకు రాజీనామా చేయడం గొప్ప కాదని, ప్రాణాలు అర్పించినవారే అసలైన వీరులని, వారే అసలైన పౌరులని కొనియాడారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. రాష్ట్రం సమైక్యంగానే ఉండాలంటూ మరో విడత నివేదికను శ్రీకృష్ణ కమిటీకి అందించానన్నారు. రాష్ట్ర విభజనకు తాము వంద కారణాలు చెబుతాం, సమైక్యంగా ఎందుకుండాలో ఒక్క కారణం చెప్పట్లేదన్న ఆరోపణల్లో నిజం లేదని నిరూపించడానికే తాను ప్రతి వారం ఒక్కో నివేదికను కమిటీకి సమర్పిస్తానని చెప్పారు. సమైక్యాంధ్రకు 150 ఏళ్లకు పైగా చరిత్ర ఉందని, దానికి సంబంధించిన అన్ని రికార్డులను తాను కమిటీ ముందుంచుతానని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి 50 ఏళ్ల చరిత్ర ఉందనడంలో వాస్తవం లేదని, కేవలం 11 ఏళ్ల చరిత్రే ఉందన్నారు. మంత్రి బొత్స వ్యాఖ్యలను తప్పు పట్టలేనని, అది ఆయన అభిప్రాయమన్నా రు.












Click it and Unblock the Notifications