వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రమోద్ తమ్ముడు ప్రవీణ్ మహాజన్ మృతి

ప్రమోద్ మహాజన్ హత్య కేసులో ముంబై కోర్టు 2007 డిసెంబర్‌లో ప్రవీణ్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. నిరుడు నవంబర్ 27న ఆయన 14 రోజులపాటు పెరోల్ పై విడుదలయ్యారు. పెరోల్ కాలం ముగిసి తిరిగి జైలుకు వెళ్లాల్సిన సమయంలోనే తలనొప్పి, అధిక రక్తపోటు రావడంతో ప్రవీణ్‌ను ఆస్పత్రికి తరలించారు. ఆయన బ్రెయిన్ హేమరేజ్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. తర్వాత కోమాలోకి వెళ్లిన ప్రవీణ్ తిరిగి కోలుకోలేకపోయారు.