Suryakumar Yadav: "ముందుంది ముసళ్ల పండగ"?- కెప్టెన్సీ తొలగింపుపై సూర్య పంచ్ ..!

ఐర్లాండ్-ఇంగ్లండ్ టూర్ కు టీమిండియా టీ20 జట్టు కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ ను ఎంపిక చేసిన బీసీసీఐ సెలెక్టర్లు.. ఊహించినట్లుగానే ప్రస్తుత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (suryakumar Yadav)పై వేటు వేశారు. ఇందుకు గల కారణాల్ని కూడా ఛీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు. ఈ నేపథ్యంలో సూర్య కెప్టెన్సీ వేటు తర్వాత తొలిసారి తాజా పరిణామాలపై స్పందించాడు. ఇన్ స్టా గ్రామ్ లో పెట్టిన పోస్టులో కొత్తగా ఎంపిక చేసిన జట్టుకు సూర్య శుభాకాంక్షలు తెలిపాడు.

అదే సమయంలో ఏక వాక్యంలో టీమిండియా గురించి సూర్య కుమార్ యాదవ్ చెప్పేశాడు. రాబోయే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలని ఆకాంక్షిస్తున్నట్లు సూర్య తన పోస్టులో పేర్కొన్నాడు. అయితే చూసేందుకు ఇది చాలా సింపుల్ ప్రకటనలా కనిపిస్తున్నా.. దీని వెనుక రాబోయే రోజుల్లో జట్టుకు అంతఈజీ కాదని సూర్య చెప్పకనే చెప్పేశాడు. ఎందుకంటే కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కు మన దేశంలో జరిగిన ఐపీఎల్ లో నిరూపించుకోవడం సులభం కానీ, ఇంగ్లండ్ టూర్ లో అదే స్ధాయిలో రాణించడం మాత్రం కష్టం. దీన్ని దృష్టిలో ఉంచుకునే సూర్య ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

Suryakumar Yadav s First Words After Being Stripped of T20I Captaincy

వాస్దవానికి సూర్యకుమార్ యాదవ్ ను కెప్టెన్సీ నుంచి తప్పించిన ఛీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్.. దీనిపై మాట్లాడుతూ. . అతని గత ఫామ్ సరిగ్గా లేదన్నాడు. అందుకే ఈ మార్పు చేసినట్లు అజిత్ అగార్కర్ వెల్లడించాడు. కెప్టెన్సీతో పాటు జట్టులో స్థానాన్ని కూడా సూర్య కోల్పోవడం వెనుక ప్రధాన కారణం ఫామే. అయితే భారత్ కు ఈ ఏడాదే టీ20 వరల్డ్ కప్ అందించిన సూర్యను కెప్టెన్సీ నుంచి తప్పించినా ఆటగాడిగా కూడా వేటు వేయడం చర్చనీయాంశమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+