స్టాలిన్ బిగ్ యూటర్న్..! విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేద్దాం..!

తమిళనాడులో గత అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా నిలిచిన విజయ్ టీవీకేకు తమ డీఎంకే కూటమిలో ఉన్న పార్టీల్ని పంపి మద్దతు ఇప్పించిన మాజీ సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin).. ఇవాళ యూటర్న్ తీసుకున్నారు. ఇవాళ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరిన సందర్బంగా డీఎంకే కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన స్టాలిన్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ ప్రభుత్వానికి తాను మద్దతు ఎందుకు ఇప్పించానో చెబుతూనే, ఇప్పుడు ప్రభుత్వాన్ని కూల్చేయాలని పిలుపునిచ్చారు.

Vijay: సీఎంగా తొలి సభలోనే విజయ్ ఫైర్..! స్టాలిన్ కు వార్నింగ్..! బ్లాక్ కోటు వెనుక ?
Vijay: సీఎంగా తొలి సభలోనే విజయ్ ఫైర్..! స్టాలిన్ కు వార్నింగ్..! బ్లాక్ కోటు వెనుక ?

టీవీకే ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సిద్ధం కావాలని డీఎంకే కార్యకర్తలకు స్టాలిన్ ఇవాళ పిలుపునిచ్చారు. టీవీకే ప్రభుత్వం పడిపోకుండా ఇతర పార్టీలు సాయం చేస్తున్నాయని, ఒకప్పుడు డీఎంకే కూటమిలో ఉన్నవే ఈ పార్టీలు అన్నారు. మద్దతు ఇచ్చే ముందు ఆయా పార్టీల నేతలు తనని సంప్రదించారని స్టాలిన్ గుర్తుచేశారు. వారికి స్వంత నిర్ణయం తీసుకునే హక్కు ఉందని తాను చెప్పానన్నారు.అయితే అప్పుడు గవర్నర్ పాలన రాకుండా ఉండటమే తమ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు.

MK Stalin Backed TVK Into Power Now He s Asking DMK Cadre to Bring It Down
AIADMKకు మరో బిగ్ షాక్..! విజయ్ పార్టీలోకి నలుగురు మాజీ మంత్రులు..!
AIADMKకు మరో బిగ్ షాక్..! విజయ్ పార్టీలోకి నలుగురు మాజీ మంత్రులు..!

గవర్నర్ ద్వారా బీజేపీ పాలన సాగించవచ్చని స్టాలిన్ ఆరోపించారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం కుప్పకూలాల్సిన అవసరం ఉందని స్టాలిన్ స్పష్టం చేశారు. పార్టీలో కొత్త నేతలను చేర్చుకునే సందర్భంగా స్టాలిన్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. చరిత్రలో డీఎంకే ఎన్నో గెలుపోటములను చూసిందని, కరుణానిధి అధికారం కంటే ప్రజాస్వామ్యానికి విలువ ఇచ్చారని తెలిపారు. ఎమర్జెన్సీ సమయంలో అధికారానికి దూరమైనా వారు వెనక్కి తగ్గలేదన్నారు. 1991, 2001లో ఎదురైన ఓటములను స్టాలిన్ గుర్తు చేశారు. అధికారంలో లేకున్నా పార్టీ కోసం వారు వచ్చారని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. హోదా, విలాసాల కోసం కాకుండా పార్టీ కోసం పని చేయాలని వారిని కోరారు. పార్టీకి అండగా ఉండి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ఆయన పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+