ఇంతకన్నా తీవ్ర ఉద్యమాలు చూశా: సిఎం

ప్రభుత్వ వైఖరిని నేను శ్రీకృష్ణ కమిటీకి అందించలేదని, ఆ యోచన కూడా లేదని, రాష్ట్రప్రభుత్వ దృక్పథం ఏమిటో వెల్లడించాలని కమిటీ కోరితే అధిష్ఠానం ఆదేశానుసారం నివేదిక ఇస్తానని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు వస్తే సచివాలయంలోనే ఉంటూ సమీక్షించవచ్చునని, రాజకీయ వైపరీత్యాలను తట్టుకోవడం కష్టమేనని అని రోశయ్య వ్యాఖ్యానించారు. కమిటీ గురువారం రాష్ట్రానికి రానున్నదని, వాళ్ల కార్యక్రమం కూడా అందరినీ కలుసుకుని అభిప్రాయాలు సేకరించడమేనని అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశాల తర్వాత మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ ఉండొచ్చని, ఈ విషయాలను ముందు మీడియాకు చెప్పే చేస్తానని అన్నారు. ఒకానొక సమయంలో తన కంటే పీసీసీ అధ్యక్షుడే హోదాలో పెద్దవాడిగా భావిస్తానని రోశయ్య అన్నారు. దీంతో డీఎస్ నవ్వారు. ఈ విషయాలపై స్పందించేందుకు నిరాకరించారు.












Click it and Unblock the Notifications