హైదరాబాద్ లో కమిటీ సభ్యులు: నిరసనలు

Srikrishna
హైదరాబాద్: తీవ్ర నిరసనల మధ్య జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సభ్యులు తొలిసారి గురువారం హైదరాబాదు చేరుకున్నారు. శ్రీకృష్ణ కమిటీని వ్యతిరేకిస్తూ తెలంగాణ ఆందోళనకారులు నిరసన ప్రదర్శనలకు దిగారు. హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయంలోనే తెలంగాణవాదులు కమిటీ సభ్యులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పలువురు న్యాయవాదులు నిరసన ప్రదర్సన నిర్వహించారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. భారీ భద్రత మధ్య కమిటీ సభ్యులు హైదరాబాదులోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు.

లేక్ వ్యూ గెస్ట్ హౌస్ వద్ద కూడా కమిటీ సభ్యులకు నిరసనలు తప్ప లేదు. రిటైర్డ్ ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ నాయకత్వంలో తెలంగాణ వాదులు లేక్ వ్యూ గెస్ట్ హౌస్ వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు. కమిటీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి పంజగుట్ట పోలీసు స్టేషన్ కు తరలించారు. శ్రీకృష్ణ కమిటీకి వ్యతిరేకంగా తెలంగాణ జిల్లాల్లో కూడా నిరసనలు వెల్లువెత్తాయి. ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలో సింగరేణి కార్మికులు నిరసనకు దిగారు. రోడ్డుపైన ఆటాపాటా నిర్వహించారు.

హైదరాబాద్ చేరుకున్న కమిటీ సభ్యులు గురువారం సాయంత్రం గవర్నర్ నరసింహన్ ను కలుస్తారు. ఆయన ఇచ్చే విందులో పాల్గొంటారు. రేపు శుక్రవారం ముఖ్యమంత్రి కె రోశయ్యతో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్ తో భేటీ అవుతారు. తమ పర్యటనలో వారు రాజకీయ పార్టీల నాయకులతో మర్యాదపూర్వకంగా సమావేశమవుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+