తెలంగాణ ప్రత్యేక కమిటీకి బాబు ఓకె

Nagam Janardhan Reddy
హైదరాబాద్: తెలంగాణ కోసం ప్రత్యేక సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకులు నిర్ణయించుకున్నారు. తెలంగాణలో పార్టీని సమన్వయపరచడానికి, జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి నివేదిక సమర్పించడానికి ఈ కమిటీని ఏర్పాటు చేయాలని వారు నిర్ణయించుకున్నారు. ఈ ప్రత్యేక కమిటీకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆమోద ముద్ర వేసినట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అవసరమైన నివేదికను రూపొందించి, జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి ఈ కమిటీ నివేదిక సమర్పిస్తుంది.

కాగా, తెలంగాణలో పార్టీని సమన్వయం చేయడానికి కూడా ఈ కమిటీ పనిచేస్తుందని అనుకుంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నాగం జనార్దన్ రెడ్డిని కమిటీ కన్వీనర్ గా వేసే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో మొదటి నుంచి ఆయన క్రీయాశీలకంగా ఉంటున్నారు. సీమాంధ్ర తెలుగుదేశం నాయకుల నుంచి ఈ కమిటీకి వ్యతిరేకత ఉండకపోవచ్చునని తెలుస్తోంది. చంద్రబాబు వ్యూహాత్మకంగా తెలంగాణ ప్రత్యేక కమిటీకి ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+