ముంబై: ఆంధ్రుల షిర్డీయాత్రలో పెను విషాదం సంభవించింది. షిర్డీ వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బస్సు మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. పలువురు గాయపడ్డారు. షిర్డీ యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు కాళేశ్వరి ట్రావెల్స్ కు చెందింది. విజయవాడ నుంచి బయలుదేరిన బస్సు మహారాష్ట్రలోని జామ్ ఖైడ్ వద్ద విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది.
ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. మృతులంతా ఆంధ్రప్రదేశ్ కు చెందినవారు. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిలో కొంత మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.