బడ్జెట్ పై చర్చ కొనసాగుతుంది: స్పీకర్

బడ్జెట్ పై చర్చ ముగిసిందని స్పీకర్ ప్రకటించిన తర్వాత మళ్లీ చర్చను ప్రారంభించడం శాసనసభ చరిత్రలో ఇదే తొలిసారి. మహిళా బిల్లులో ఒబిసి కోటా, ముస్లిం మైనారిటీలకు కోటా ఇవ్వాలనే అంశాలను కేంద్రానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో చేర్చాలని మజ్లీస్ సభ్యులు గురువారం శాసనసభలో పట్టుబట్టడంతో బడ్జెట్ పై ముఖ్యమంత్రి సమాధానం ఇవ్వకుండానే స్పీకర్ చర్చను ముగించారు. బడ్జెట్ పై చర్చకు ముఖ్యమంత్రి సమాధానం ఇచ్చినట్లుగానే భావించాలని ఆయన చెప్పారు. దీనిపై శుక్రవారం శాననసభలో ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి.












Click it and Unblock the Notifications