రాజకీయ చర్చలు జరగలేదు: శ్రీకృష్ణ

VK Duggal
హైదరాబాద్: తాము గురువారం సాయంత్రం నిర్వహించిన గవర్నర్ విందు సమావేశం రాజకీయపరమైంది కాదని ఆంధ్రప్రదేశ్ పరిస్థితిపై ఏర్పాటైన కమిటీ చైర్మన్ జస్టిస్ శ్రీకృష్ణ స్పష్టం చేశారు. అది స్నేహపూర్వక సమావేశం మాత్రమేనని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తమ తొలి పర్యటన పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇది తమ ప్రాథమిక పర్యటన మాత్రమేనని ఆయన అన్నారు. ఏప్రిల్ నుంచి రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఏప్రిల్ మరోసారి రాష్టంలో పర్యటిస్తామని ఆయన చెప్పారు. పరస్పర విశ్వాసం కోసం సమావేశం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. తమ రాష్ట్ర తొలి పర్యటన ఫలితం ఇచ్చిందని కమిటీ సభ్య కార్యదర్శి వికె దుగ్గల్ చెప్పారు.కేవలం రాజకీయ నాయకులతో గవర్నర్ విందు సమావేశంలో పరిచయం చేసుకున్నామని శ్రీకృష్ణ చెప్పారు. ఒకే అభిప్రాయం ఉన్నా, రెండు అభిప్రాయాలున్నా, మూడు అభిప్రాయాలున్నా తమకు చెప్పాలని, వాటిని తాము విశ్లేషిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా శ్రీకృష్ణ అన్నారు.

అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే నివేదిక సమర్పిస్తామని ఆయన చెప్పారు. హైదరాబాదులో శాశ్వత కార్యాలయం ఉండదని, ఢిల్లీలోనే శాశ్వత కార్యాలయం ఉంటుందని వికె దుగ్గల్ చెప్పారు. విచారణకు లేక్ వ్యూ, ఎంసిహెచ్ ఆర్డీ, జూబిలీహాల్ ఎంపిక చేసినట్లు ఆయన చెప్పారు. ఎలక్ట్రానికి కమ్యూనికేషన్ వ్యవస్థ అభివృద్ధి చెందిన ప్రస్తుత తరుణంలో హైదరాబాదులో కార్యాలయం అవసరం లేదని శ్రీకృష్ణ అన్నారు. అవసరమైతే ఇక్కడ నోడల్ అధికారి ఉఁటారని ఆయన చెప్పారు. ప్రత్యేకాంశాలపై పరిశోధనలకు కమిటీ సభ్యులు ఒక్కరు గానీ గ్రూపుగా గానీ వెళ్తారని ఆయన చెప్పారు. విధివిధానాలు స్పష్టంగా ఉన్నాయని, విధివిధానాల ద్వారా తాము విచారణ జరిపితే ఫలితం ఏం వస్తుందనేది చూడాలని ఆయన అన్నారు.

శ్రీకృష్ణ కమిటీ మీడియా సమావేశం జరుగుతుండగా తెలంగాణ న్యాయవాదులు లేక్ వ్యూ అతిథి గృహం వద్ద ఆందోళనకు దిగారు. శ్రీకృష్ణ కమిటీని వ్యతిరేకిస్తూ వారు ఆందోళనకు దిగారు. కమిటీ గోబ్యాక్ అంటూ, జై తెలంగాణ అంటూ వారు నినాదాలు చేశారు. లేక్ వ్యూ అతిథిగృహంలోకి చొచ్చుకుపోయేందుకు న్యాయవాదులు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దాదాపు 30 మంది న్యాయవాదులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సమయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మీడియా సమావేశానంతరం శ్రీకృష్ణ కమిటీ సభ్యులు ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+