తెలంగాణ ఉద్యమానికే ఫోరం: నాగం

ప్రజల మనోభావాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మాత్రమే ఫోరం పనిచేస్తుందని ఆయన చెప్పారు. తమ పార్టీ మెదక్ శాసనసభ్యుడు మైనంపల్లి హనుమంతరావు రాజీనామా వ్యవహారంపై తాము సమావేశంలో చర్చించలేదని ఆయన చెప్పారు. ఈ వ్యవవాహారంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. శాసనసభ సభ్యులు రాజీనామా చేసిన నియోజకవర్గాల్లో అమరవీరుల కుటుంబ సభ్యులను పోటీకి దించాలనే డిమాండ్ పై అవసరమైనప్పుడు చర్చిస్తామని ఆయన చెప్పారు. రాజీనామా చేసిన తాజా మాజీ శాసనసభ్యులకు మాత్రమే తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ (జెఎసి) మద్దతిస్తుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications