లిఫ్టులో ఇరుక్కుపోయిన చిరంజీవి

విద్యుత్ సౌధలోకి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన చిరంజీవి మరో గడ్డు సమస్య కూడా ఎదురైంది. చిరంజీవి సమైక్యవాదానికి మద్దతు ఇవ్వడంపై తెలంగాణ ప్రాంత ఉద్యోగులు ఆయనను ప్రశ్నించారు. చిరంజీవి వైఖరిని వారు తప్పు పట్టారు. అంతకు ముందు ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలు, నాయకులు, శాసనసభ్యులు నెక్లెస్ రోడ్డు నుంచి విద్యుత్ సౌధ వరకు ర్యాలీ తలపెట్టారు. వారిని పోలీసులు ఖైరతాబాద్ చౌరస్తాలో అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో చిరంజీవి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.












Click it and Unblock the Notifications