తెలంగాణ కోసం విలేకరి ఆత్మహత్య

Warangal
వరంగల్‌: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పత్రికా విలేకరి ఆత్మహత్య చేసుకున్నాడు. హన్మకొండ కేయూసీ మొదటిగేటు సమీపంలో పెగడపల్లికి చెందిన మిర్యాల్‌కార్‌ సునీల్‌(25) ప్రజాశక్తి పత్రికలో ఎన్జీవోస్‌ కాలనీ విలేకరిగా పనిచేస్తున్నాడు. తెలంగాణ ఉద్యమం పట్ల నాయకులు అవలంబిస్తున్న వైఖరి పట్ల మనస్తాపం చెందిన సునీల్‌ సోమవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి తల్లి స్వరూప, సోదరుడు అనిల్‌ ఉన్నారు. సునీల్‌ మృతితో కుటుంబ సభ్యులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. సంఘటన స్థలానికి హన్మకొండ సీఐ శోభన్‌కుమార్‌, ఎస్సై రవికుమార్‌ చేరుకుని పరిశీలించారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు.

"తెలంగాణ ఉద్యమం ఉధృతమైనా నేను వార్తలు రాయలేక పోతున్నాను. ఇప్పుడు వచ్చిన ఉద్యమ ఉధృతిని ఏ పార్టీ ఆపలేదు. ఎందరో విద్యార్థులు తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేశారు. రాజకీయ నాయకులు ఇప్పటికైనా మేల్కొని తెలంగాణ ప్రజల కలను నిజం చేయాలి. తెలంగాణ రిపోర్టర్‌గా ప్రాణత్యాగం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. విద్యార్థుల బలిదానాలు చూస్తుంటే ఎందుకు చనిపోతున్నారనుకునేవాడిని. కానీ, మనస్సు కలవరం చెందినప్పుడు చనిపోతారని అర్థం చేసుకున్నాను. బలిదానాలు ఆగాలంటే తెలంగాణ రావాలి. తనచావుతోనైనా నాయకులు, పార్టీలు కళ్లు తెరవాలి, తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందని సునీల్‌ సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+