రాజ్యసభ నుంచి 7గురు ఎంపీల సస్పెన్షన్

సుభాష్ యాదవ్, సబీర్ అలీ, వీర్పాల్ సింగ్ యాదవ్, నంద్ కిషోర్ యాదవ్, అమీర్ ఆలం ఖాన్, కమల్ అక్తర్, ఎజాజ్ అలీ రాజ్యసభ నుంచి సస్పెండయ్యారు. వారి సస్పెన్షన్ కు పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ తీర్మానం ప్రతిపాదించగా సభ మూజువాణీ వోటుతో ఆమోదం తెలిపింది.
మహిళా బిల్లుపై పార్లమెంటు ఉభయ సభల్లోనూ గందరగోళం చెలరేగుతుండడంతో పదే పదే సభలు వాయిదా పడుతూ వస్తున్నాయి. రాజ్యసభను చైర్మన్ హమీద్ అన్సారీ రెండు గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా సభ వాయిదా పడింది.












Click it and Unblock the Notifications