విద్యుత్ సమస్య తీరుతుంది: పొన్నాల

వారంలో ఒక రోజు ఇప్పటికే పరిశ్రమలకు విద్యుత్ కోత విధిస్తున్నట్లు ఆయన తెలిపారు. పంటలు ఎండిపోకుండా వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు ఆయన చెపాపుర. మంచినీరు, సాగనీటి సమస్యలు లేకుండా చర్చలు తీసుకుంటామని ఆయన చెప్పారు. విద్యార్థుల చదువులకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ సరఫరా చేసేందేకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా తయారైందని ప్రతిపక్షాలు విమర్సించాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడంలో విద్యుత్ రంగానికి ప్రధాన పాత్ర అని లోకసత్తా శాసనసభ్యుడు జయప్రకాష్ నారాయణ అన్నారు.