'జనం గుండెల్లో చిరంజీవే సిఎం'

West Godavari Dist
భీమవరం: ప్రజలు ప్రజారాజ్యం పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని, రాబోయే కాలంలో పీఆర్పీ కంచుకోటగా ఏర్పడుతుందని పీఆర్పీ రాష్ట్ర కార్యదర్శి కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు. స్థానిక చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ భవనంలో బుధవారం పీఆర్పీ జిల్లా నాయకులు, కార్యకర్తలవిస్తృత స్థాయి సమావేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు అశోక్‌గౌడ్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కొత్తపల్లి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో చిరంజీవి పార్టీని స్థాపించారని, చిరంజీవి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు ముందుకు సాగాలన్నారు. అధికారికంగా చిరంజీవి ముఖ్యమంత్రి కాకపోయినా, ప్రజల గుండెల్లో ఆయనెప్పుడూ ముఖ్యమంత్రేనని కొత్తపల్లి అన్నారు. మండల జిల్లా, గ్రామస్థాయిలో పార్టీ కార్యకర్తలు, నాయకులు సమావేశం నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకోవాలన్నారు.

పార్టీ కార్యకర్తలు సమస్యలను పరిష్కరించే వరకు వీర సైనికుడిలా పనిచేసి, సమస్యలను పరిష్కరించేది ఒక్క పీఆర్పీయేనని ప్రజల్లో నమ్మకం కలిగించాలని కొత్తపల్లి సూచించారు. ప్రజలకు పీఆర్పీ అండగా నిలవాలని, గ్రామాల్లోని ప్రజలను చైతన్యపరచవలసినవసరం, కార్యకర్తలపై ఉందన్నారు. అధికారం ఉన్నా లేకపోయినా మనందరం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అధికధరలు, కరెంట్‌కోత, ఎరువుల పెరుగుదలలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని కొత్తపల్లి విమర్శించారు. చిరంజీవి ముఖ్యమంత్రి అయితేనే పేదల కష్టాలు తీరుతాయని అన్నారు. పార్టీ జిల్లాఅధ్యక్షుడు అశోక్‌గౌడ్‌ మాట్లాడుతూ కష్టపడి పార్టీకి సేవలందించిన ప్రతిఒక్కరికి పీఆర్పీ అండగా ఉంటుందన్నారు. జయాపజయాలు ప్రతిఒక్కరికి తప్పవని, ఒక్క ఓటమి విజయానికి నాంది అని అశోక్‌గౌడ్‌ అన్నారు. చేసిన తప్పిదాలను సరిచేసుకుని, భవిష్యత్‌లోని విజయాలబాటకు పునాదులు వెయ్యాలని ఆయనఅన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+