మంత్రివర్గ విస్తరణతో జగన్ కు చెక్?

రోశయ్య తన మంత్రివర్గంలోకి స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డిని, జెసి దివాకర్ రెడ్డిని, కె జానారెడ్డిని తీసుకుంటారనే వార్తలు వస్తున్నాయి. శాసనసభ స్పీకర్ గా సనత్ నగర్ శాసనసభ్యుడు మర్రి శశిధర్ రెడ్డి నియామకం జరగవచ్చునని అంటున్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం మరమ్మతు పనులన్నీ శశిధర్ రెడ్డే చూస్తున్నారు. కాగా, దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి సతీమణి విజయలక్ష్మికి కూడా మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశాలున్నాయి. ఆనం బ్రదర్స్ లాంటి వారికి చెక్ పెట్టేందుకు రోశయ్య సిద్ధమైనట్లు చెబుతున్నారు. ఇప్పటికే మంత్రివర్గ విస్తరణకు రోశయ్యకు పార్టీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ అందినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications