గుంటూరు: జల్సాల కోసం దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి పోలీసులు లక్షా 20 వేల రూపాయల విలువ చేసే కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు డబ్బులు సరిపోకపోవడంతో వారు దొంగతనాలకు పాల్పడడాన్ని వారు అలవాటుగా మార్చుకున్నారు.
స్నేహితుల ఇళ్లలోనే వారు దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. కంప్యూటర్స్, ల్యాప్ టాప్స్ ను వారు దొంగతనాలు చేస్తూ వస్తున్నారని వారు చెప్పారు. గతంలో కూడా ఇంజినీరింగ్ విద్యార్థులు ఇలా పట్టుబడిన సందర్భాలున్నాయి.