కర్నూలు: కర్నూలు జిల్లాలోని పాణ్యం మండలం ఎస్ కొత్తూరు గ్రామంలో సోమవారం దారుణం జరిగింది. భార్యపై భర్త యాసిడ్ దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆమె ప్రాణాలు విడిచింది. నాగేశ్వరరావు అనే వ్యక్తి లక్ష్మి అనే తన భార్యపై ఈ దారుణానికి ఒడిగట్టాడు. కుటుంబ తగాదాలే ఈ దాడికి కారణమని భావిస్తున్నారు.
నాగేశ్వరరావు, లక్ష్మిలకు మధ్య ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కూతురు, ఒక కూమారుడు ఉన్నారు. నాగేశ్వర రావును గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు