న్యూఢిల్లీ: నలుగురు సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) సభ్యులపై విధించిన నిషేధాన్ని రాజ్యసభ సోమవారం ఎత్తి మహిళా బిల్లుపై గత వారం అసభ్య ప్రవర్తనకు గాను రాజ్యసభ నుంచి వారు సస్పెన్షన్ కు గురయ్యారు. వీర్ పాల్ సింగ్ యాదవ్, నంద్ కిశోర్ యాదవ్, అమీర్ ఆలం ఖాన్, కమల్ అక్తర్ లపై విధించిన నిషేధం ఎత్తివేతకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పవన్ కుమార్ బన్సాల్ తీర్మానం ప్రతిపాదించారు.
ఈ నలుగురు పార్లమెంటు సభ్యులు గత వారం రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీని కలిశారు. అయితే ఏడుగురిపై కూడా సస్పెన్షన్ ఎత్తేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.