హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ మాజీ అధినేత రామలింగరాజుకు సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. బెయిల్ కోసం రామలింగరాజు పెట్టుకున్న పిటిషన్ ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. తాను హృద్రోగ సంబంధిత వ్యాధితోనూ, ఇతర వ్యాధులతోనూ బాధపడుతున్నానని, తన పరిస్థితిని అర్థం చేసుకుని తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తన పిటిషన్ లో చెప్పుకున్నారు. కోర్టు విధించే అన్ని షరతులకు కూడా అంగీకరిస్తానని ఆయన చెప్పుకున్నారు.
అయితే సుప్రీంకోర్టు రామలింగరాజుకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రామలింగరాజుకు బెయిల్ నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టులో కూడా ఆయన చుక్కెదురైంది.