తిరుపతిలోనూ చిరంజీవి కొందరి వాడేనా?

నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు స్థానిక నాయకులతో సంబంధం లేకుండా, విషయ సేకరణకు చిరంజీవి తన సమీప బంధువు ఒకరిని తిరుపతిలో ఉంచారు. ఈ వ్యవహారం ప్రజారాజ్యం శ్రేణుల్లో కలకలం సృష్టిస్తోంది. ఆయన కేవలం ఎవరో కొందరు చేస్తున్న ఫిర్యాదులను నమ్మేసి తమపై అధినేతకు ఫిర్యాదు చేస్తున్నారన్న అసంతృప్తి పార్టీ శ్రేణుల్లో నెలకొంది. పార్టీ కోసం స్థానికంగా ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేయలేదనే విషయాలపై పూర్తి అవగాహన లేకుండా కొందరు చెప్పే మాటలను నమ్ముతున్నారని వాపోతున్నారు. వాస్తవాలను సరిచూసుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
నగర కన్వీనర్‌తోనూ పార్టీ శ్రేణుల్లోని ఒక గ్రూప్ దూరంగా వ్యవహరిస్తోంది. కొందరు నాయకులు పార్టీ కార్యాలయానికి వెళ్లడం పూర్తిగా తగ్గించారు. కన్వీనర్ తమను కలుపుకోవడం లేదన్న అసంతృప్తిని పరోక్షంగా వ్యక్తం చేస్తున్నారు. అధినేత వేసిన కోర్‌కమిటీ కూడా మూలన పడినట్టేనని విమర్శలు ఉన్నాయి. ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో సరైన శ్రద్ధ ఉండడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కేవలం లేఖ ఇవ్వడం, ఆ వివరాలు నోట్ చేసుకోవడం మినహా, స్వయంగా ఆయా కార్యాలయాలకు వెళ్లి ప్రజల సమస్యలపై పనిచేస్తున్న నాయకులు దాదాపుగా లేరు.












Click it and Unblock the Notifications