ఫ్రీజోన్: రాజ్యాంగాన్నైనా సవరించాలి: కె చంద్రశేఖర రావు

హైదరాబాద్ ఆరోజోన్ అన్న అంశంపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌తో ప్రయోజనం ఉండదని టీఆర్‌ఎస్ ఆనాడే చెప్పిందని, అదే ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో రుజువయిందని అన్నారు. హైదరాబాద్ ఆరోజోన్ అని ముఖ్యమంత్రి స్పష్టంచేశారని, దీనికి కట్టుబడి శాసనసభ, కేబినెట్ తీర్మానాలు కేంద్రానికి పంపాలని, ఈ విషయంలో అవసరమైన రాజ్యాంగ సవరణ లేదా రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ చేయాలని అన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించి, బుజ్జగింపు ధోరణులకు దిగితే సహించమని, తీవ్రమైన ఉద్యమాన్ని చేపడతామని ఆయన హెచ్చరించారు. గతంలో జై ఆంధ్ర ఉద్యమాన్ని తెచ్చి ముల్కీ నిబంధనలను రద్దు చేయించారని, ఇప్పుడు కూడా అదే ధోరణి కనిపిస్తోందని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications