మున్సిపల్ ఎన్నికల పై కూటమి అనూహ్య నిర్ణయం- వైసీపీ ఇక..!!
ఏపీ రాజకీయాల్లో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి వర్సస్ వైసీపీ కొత్త రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నాయి. 2029 ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటి నుంచే ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ఈ సమయంలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్దం అవుతోంది. అందులో భాగంగా ముందుగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు నిర్ణయించింది. కాగా, ఈ ఎన్నికల పైన ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ఆసక్తి కరంగా మారుతోంది. వైసీపీ ఏం చేయబోతుంది అనేది కీలకంగా మారనుంది.
ఏపీలో స్థానిక ఎన్నికల సమరానికి కసరత్తు జరుగుతోంది. ముందుగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణ పైన ఒక నిర్ణయానికి వచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఒకే దఫా ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో గతంలో 100 పట్టణ స్థానిక సంస్థలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. మరో 23 మునిసిపాలిటీలకు కోర్టు కేసుల కారణంగా జరుపలేదు. ఈ కేసులు ఉపసంహరింపజేసి వీటిలోనూ ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. వార్డుల పునర్విభజన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని నిర్దేశించారు. వీలైనంత త్వరగా పట్టణాల్లో అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేయాలని సూచించారు. కూటమి పార్టీలు సీట్ల పంపకాల పైన ఇప్పటికే చర్చ మొదలైంది. కాగా.. పార్టీ అధినేతలు సీట్ల సర్దుబాటు పైన నిర్ణయం తీసుకుంటారని సీఎం చంద్రబాబు స్పష్టం చేసారు.

కూటమి తాజా నిర్ణయంతో
2024 ఎన్నికల ఫార్ములా స్థానిక ఎన్నికలకు ఉండదని.. తమ పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో పోటీ చేస్తామని జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. దీంతో.. సీట్ల కోసం మూడు పార్టీల నుంచి భిన్నాభిప్రాయాలు లేకుండా.. సమన్వయ భేటీలో నిర్ణయం తీసుకోవాలని తాజా నిర్ణయం తీసుకున్నారు. ఇక.. అటు మాజీ సీఎం జగన్ ఈ ఎన్నికల పైన పార్టీ ముఖ్య నేతలకు దిశా నిర్దేశం చేసారు. వార్డు నుంచి మున్సిపాల్టీ వరకు ఎక్కడ ఎన్నిక జరిగినా ఖచ్చితంగా పార్టీ అభ్యర్ధి బరిలో ఉండాలని తేల్చి చెప్పారు. ఎక్కడైనా పోటీలో పార్టీ అభ్యర్ధి లేకుండా నియోజకవర్గ ఇంఛార్జ్ పైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్రంలో మారుతున్న పరిస్థితులు తమకు అనుకూలంగా ఉంటాయని వైసీపీ అంచనా వేస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి కూటమి హవా కొనసాగుతుందని అధికార పార్టీల నేతలు చెబుతున్నారు. దీంతో.. రాష్ట్రంలో జరిగే స్థానిక ఎన్నికల సమరం ఉత్కంఠగా మారుతోంది.












Click it and Unblock the Notifications