పట్టు బిగిస్తున్న వేళ కాంగ్రెస్ కు ప్రధాని మోదీ మాస్టర్ స్ట్రోక్...!!

ఢిల్లీ కేంద్రంగా రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేస్తూ కాక్రోచ్ పార్టీ మూడు రోజులుగా నిరసన కొనసాగిస్తోంది. వీరికి మద్దతుగా ప్రధాని నివాసం వద్ద రాహుల్, ప్రియాంక పార్టీ నేతలతో కలిసి మెరుపు ధర్నా నిర్వహించారు. అటు ఇదే అంశం పైన పార్లమెంట్ స్తంభించారు. కాంగ్రెస్ పట్టు బిగిస్తున్న వేళ.. ప్రధాని మోదీ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. తాజా పరిణామంతో పార్లమెంట్ వేదికగా రాజకీయంగా మరింత ఆసక్తి కరంగా మారుతోంది.

పార్లమెంట్ సమావేశాల వేళ ఢిల్లీ నిరసనలతో హోరెత్తుతోంది. కాక్రోచ్ పార్టీ.. కాంగ్రెస్ నేతలు వరుస నిరసనలు కొనసాగిస్తున్నారు. ప్రధాని మోదీ నివాసం వద్ద రాహుల్, ప్రియాంక చేసిన ధర్నా జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది. ఆ తరువాత ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకొని.. అక్కడ నుంచి తరలించారు. దీంతో.. వీరికి మద్దతుగా కాంగ్రెస్ నిరసనలకు దిగింది. పార్లమెంట్ సమావేశాలను విపక్షాలు అడ్డుకున్నాయి. ప్రభుత్వం నీట్ పైన ప్రకటనకు సిద్దమైంది. ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయించన తరువాతనే చర్చ చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఇదే సమయంలో పార్లమెంట్ వేదికగా ఇండి కూటమిలో కీలక పార్టీ.. కాంగ్రెస్ మిత్రపక్షం.. రాహుల్ సన్నిహిత నే శరద్ పవన్ తన కుమార్తెతో కలిసి ప్రధాని మోదీతో సమావేశం అయ్యారు.

ncp-chief-sharad-pawar-and-his-daughter-supriya-sule-met-prime-minister-narendra-modi-in-parliament

ఎన్డీఏ కు ఎన్సీపీ మద్దతు..?

కొంత కాలంగా శరద్ పవార్ ఇండీ కూటమిని వీడి ఎన్డీఏలో చేరేందుకు సిద్దమయ్యారనే ప్రచారం సాగుతోంది. అందులో భాగంగా ఆయన కుమార్తె సుప్రియా సూలేకు కేంద్రంలో మంత్రి పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తాజాగా సుప్రియా సూలే.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన తరువాత డీలిమిటేషన్ బిల్లు చూసిన తరువాత తమ మద్దతు పైన నిర్ణయం తీసుకుంటామని సానుకూల సంకేతాలు ఇచ్చారు. ఈ సారి సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్.. డీ లిమిటేషన్ బిల్లు ఆమోదింపచేసుకోవాలని బీజేపీ డిసైడ్ అయింది. దీంతో.. తన కార్యాలయానికి వచ్చిన శరద్ పవార్ కు మోదీ స్వయంగా స్వాగతం పలికారు. చేయి అందించి లోపలకు తోడ్కొని వెళ్లారు. ఇది కాంగ్రెస్ కు షాకింగ్ గా మారనుంది. అయితే, తాజా నీట్ వివాదం.. ఆందోళన పైన చర్యలు తీసుకోవాలని ప్రధాని తో శరద్ పవార్ చర్చించారని ఎన్సీపీ నేతలు చెబుతున్నారు. శరద్ పవర్ - మోదీ భేటీ నిర్ణయాల పైన ఇప్పుడు రాజకీయంగా ఉత్కంఠ పెంచుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+