తల్లికి వందనం నిధుల విడుదల..! అప్పటివరకూ పడతాయన్న లోకేష్..!

ఏపీలో పేద విద్యార్ధులు, తల్లితండ్రులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న తల్లికి వందనం పథకం (Talliki Vandanam) నిధులు ఎట్టకేలకు విడుదలయ్యాయి. ఇవాళ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఈ నిధుల్ని విడుదల చేసినట్లు ఎక్స్ లో ట్వీట్ చేశారు. అలాగే ఈ నిధులు ఎప్పటివరకూ తల్లుల ఖాతాల్లో జమ అవుతాయో కూడా ట్వీట్ లో వెల్లడించారు. దీంతో విద్యార్ధుల ఎదురుచూపులు ముగిసినట్లయింది.

తల్లికి వందనం పథకం నిధుల విడుదలపై ఇవాళ లోకేష్ ట్వీట్ చేశారు. ఇందులో ఆాయన "పిల్లలే మన సంపద. వారి చదువులే మనకు తరగని ఆస్తి. విద్యే మన రాష్ట్ర వెలకట్టలేని పెట్టుబడి. ఏ ఒక్క చిన్నారి విద్యకు దూరం కాకూడదనేది మా కూటమి ప్రభుత్వం లక్ష్యం. అందుకే ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు చదివితే అంతమందికి ఎటువంటి ఆంక్షలు లేకుండా ఇచ్చే పథకం తల్లికి వందనం రూపొందించాం. వరుసగా రెండో ఏడాది తల్లికి వందనం నిధులు విద్యా సంవత్సరం ఆరంభంలోనే విడుదల చేసాం" అని తెలిపారు.

Nara Lokesh Releases Talliki Vandanam Funds to 67 47 Lakh Accounts Credits by July 24

అలాగే తల్లికి వందనం పథకం ద్వారా ఈ ఏడాది 67.47 లక్షల మంది విద్యార్థుల తల్లులు 42.70 లక్షల మంది బ్యాంకు ఖాతాల్లో రూ.10,120.78 కోట్లు జమ చేస్తున్నామని లోకేష్ వెల్లడించారు. ఈ ప్రక్రియ 24వ తేదీ వరకు కొనసాగుతుందని లోకేష్ ట్వీట్ లో తెలిపారు. అలాగే పిల్లలను చదివించే ప్రతి తల్లికీ నా వందనం అంటూ లోకేష్ ట్వీట్ ముగించారు.ఇవాళ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉండటంతో ఈ నిధుల విడుదలకు ప్రత్యేకంగా ఎలాంటి కార్యక్రమం నిర్వహించలేదు. అలాగే లోకేష్ కూడా మంగళగిరిలో పట్టాల పంపిణీ కార్యక్రమంలో బిజీగా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+