తల్లికి వందనం నిధుల వేళ పేరెంట్స్ కు సర్కార్ బిగ్ అలర్ట్..!

ఏపీలో ఈ ఏడాది విద్యార్ధులకు తల్లికి వందనం పథకం (talliki vandanam) కింద నిధుల్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం (AP Govt) సిద్దమైంది. బుధవారం నుంచి విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో 13 వేల రూపాయల చొప్పున జమ చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతులు ఇచ్చింది. దీంతో 64 లక్షల మందికి పైగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో 10 వేల కోట్లకు పైగా మొత్తం జమ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇలాంటి కీలక సమయంలో విద్యార్ధుల తల్లితండ్రులకు ప్రభుత్వం ఓ కీలక అలర్ట్ జారీ చేసింది.

తల్లికి వందనం నిధుల్ని ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన తర్వాత తల్లుల ఖాతాల్లో జమ కావడం ప్రారంభమవుతుంది. కాబట్టి విద్యార్ధుల తల్లుల ఖాతాల్ని చెక్ చేసుకుంటే సరిపోతుంది. లేకపోతే బ్యాంకులు పంపే మెసేజ్ లను చూస్తే సరిపోతుంది. అలా కాకుండా చివరి నిమిషంలో మీకు తల్లికి వందనం నిధుల విడుదలలో సమస్య వచ్చింది, ఈ లింక్ క్లిక్ చేసి మొబైల్ నంబర్ అప్డేట్ చేసుకోండి, ఈ మెయిల్ అప్డేట్ చేసుకోండి, బ్యాంక్ అకౌంట్ అప్డేట్ చేసుకోండి, ఓటీపీ ఎంటర్ చేయండి అనే పేరుతో లింక్స్ ను సైబర్ నేరగాళ్లు షేర్ చేసే ప్రమాదం పొంచి ఉంది.

AP Govt Issues Cyber Alert Ahead of Talliki Vandanam Payment Release Tomorrow

ఈ లింక్స్ గమనిస్తే అచ్చు గుద్దినట్లు ప్రభుత్వం పంపే మెసేజ్ ల తరహాలోనే ఉండేలా సైబర్ నేరగాళ్లు జాగ్రత్త పడే అవకాశం ఉంది. కాబట్టి తల్లితండ్రులు ఎలాంటి లింక్స్ వచ్చినా, అందులో ఎలాంటి మెసేజ్ ఉన్నా వాటిని మాత్రం క్లిక్ చేయొద్దని ప్రభుత్వం కోరుతోంది. వీటిపై ఎలాంటి అనుమానం కలిగినా విద్యార్ధులు, తల్లితండ్రులు సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి ఓసారి సిబ్బందితో చెక్ చేయించుకోవాలని సూచిస్తోంది. అంతే తప్ప నిధులు పడతాయన్న ఆశతో నకిలీ లింక్ లు క్లిక్ చేసి మోసపోవద్దని పోలీసులు కూడా సూచిస్తున్నారు. కాబట్టి తల్లితండ్రులు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+