తల్లికి వందనం నిధుల జమ వేళ బిగ్ అప్డేట్- తాజా షెడ్యూల్, తొలి విడత వీరికే..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న తల్లికి వందనం నిధుల జమ పైన ప్రకటన చేసింది. రేపు (బుధవారం) తల్లికి వందనం నిధుల లబ్ది దారుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. అయితే, తొలి విడతలో నిధుల విడుదల చేసే అర్హుల జాబితాలను వార్డు/ గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతున్నారు. అదే విధంగా ఈ సారి అర్హుల సంఖ్య పెరగనుంది. కొత్తగా పాఠశాలల్లో చేరిన వారికి అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేసిన తరువాత నిధులు జమ చేయాలని నిర్ణయించారు.
ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం నిధుల జమకు తుది కసరత్తు చేస్తోంది. అర్హుల జాబితాలను లబ్ది దారులకు అందుబాటులో ఉంచనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 64,76,590 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13వేల నిధులు జమకానున్నాయి. ఇందు కోసం రూ. 10,120.78 కోట్ల భారీ మొత్తానికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 42,70,802 మంది తల్లులు/సంరక్షకులతో పాటు 67,47,190 మంది విద్యార్థులకు భారీ లబ్ధి చేకూరనుంది. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, కనీస సదుపాయాల మెరుగుదల కోసం ఒక్కో విద్యార్థి రూ. 15 వేల ఆర్థిక సాయం నుంచి రూ. 2,000 చొప్పున స్కూల్ డెవలప్మెంట్ ఫండ్ కింద మినహాయించనున్నారు.

అర్హుల జాబితాలు..షెడ్యూల్
కాగా, రేపటి నుంచి పథకం అర్దుహల జాబితాలు అందుబాటులో ఉంచనున్నారు. జూలై 22 నుండి ఆగస్టు 3: ఈ పథకంపై ఏవైనా అభ్యంతరాలు, ఫిర్యాదులు ఉంటే స్వీకరణకు గడువు గా నిర్ణయించారు. ఇక.. ఆగస్టు 4 నుండి 10వ తేదీ వరకు అందిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయి పరిశీలన, అనంతరం అదనపు అర్హుల జాబితా రూపకల్పన దిశగా నిర్ణయం తీసుకున్ానరు. ఆగస్టు 25 వ తేదీ లోగా కొత్తగా ఒకటో తరగతి.. ఇంటర్ తొలి సంవత్సరంలో చేరిన విద్యార్ధుల వివరాల నమోదుకు తుది గడువుగా ఫిక్స్ చేసారు. ఆగస్టు 30న కొత్తగా అర్హత పొందిన లబ్దిదారుల జాబితా విడుదల చేయటంతో పాటుగా. అదే రోజున వారి ఖాతాల్లోనూ నిధులు జమ చేసే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసింది. ఈ నెల 24న రంపచోడవరంలో ప్రభుత్వం మెగా పేరెంట్స్ - టీచర్ల సమావేశం నిర్వహించనుంది.












Click it and Unblock the Notifications