చిరు చుట్టూ ఫ్రీజోన్ రాజకీయం

కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ మల్లు భట్టి విక్రమార్క తదితురులు చిరంజీవితో సమావేశమయ్యారు. ప్రభుత్వ తీర్మానాన్ని బలపరచాలని వారు కోరారు. అయితే, తాను సమైక్యాంధ్రకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నానని, ఇప్పుడు ఈ తీర్మానాన్ని బలపరిస్తే తన వైఖరిని మార్చుకున్నట్లవుతుందని చిరంజీవి వారితో అన్నట్లు సమాచారం. ఈ తీర్మానం చేయకపోతే తెలంగాణ రాష్ట్ర సమితికి ఆయుధం అందించినట్లవుతుందని కాంగ్రెసు నాయకులు ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కాస్తా మెతకబడిన చిరంజీవి సభలో పరిస్థితిని చూసి వ్యవహరిస్తామని ఆయన చెప్పినట్లు సమాచారం.
ముఖ్యమంత్రి తీర్మానం ప్రతిపాదించే సమయంలో సీమాంధ్ర తెలుగుదేశం సభ్యులు, ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు స్పీకర్ వెల్ లోకి దూసుకెళ్లారు.












Click it and Unblock the Notifications