హైదరాబాద్ ఫ్రీజోన్ గానే ఉండాలి: రాజగోపాల్

రాష్ట్ర రాజధానిలో అన్ని ప్రాంతాలకు చెందిన పోలీసులు ఉండటం న్యాయమని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకే ప్రాంతానికి చెందిన వారుంటే పక్షపాతంతో వ్యవహరించే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. ఇటీవల కూకట్‌పల్లి, ఓయూ, బీహెచ్ఈఎల్ ప్రాంతాలలో జరిగిన సంఘటనలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇప్పటికీ పలుచోట్ల పోలీసులు పక్షపాత ధోరణితోనే వ్యవహరిస్తుండటం వల్ల అనేక దుష్పరిణమాలు సంభవిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తాను నిమ్స్ ఆసుపత్రిలో ఉన్నపుడు చేసేందుకు వచ్చే వారిని పోలీసులు అనుమతించలేదని గుర్తు చేశారు. అంతకుముందు అదే ఆసుపత్రిలోవేరే వ్యక్తి ఉన్నపుడు పోలీసులు ఎంతోమందిని అనుమతించారని ఆయన అన్నారు. హైదరాబాద్ ఫ్రీజోన్ కాకపోతే తెలంగాణ జిల్లాలవారు కూడా నష్టపోతారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications