విజయవాడలో నిమ్స్ తరహా ఆస్పత్రి

వైద్యులు, సిబ్బంది కొరత, వారి పనితీరు, నిర్వహణ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం పీపీపీ విధానంపై ఆసక్తి చూపుతోంది. ఈ నెల 19న రాజధానిలో జరగనున్న సమావేశంలో సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రి ఏర్పాటుకు జీవో విడుదల కానుంది. ఆ సమయంలోనే దీని నిర్వహణపై నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం నగరంలోని ఆస్పత్రిలో వివిధ విభాగాల్లో 40 మంది దాకా వైద్యుల కొరత ఉంది. కాంట్రాక్టు విధానంలో వైద్యుల నియామకాలు జరుగుతున్నా వారి సేవలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి.












Click it and Unblock the Notifications