న్యూఢిల్లీ: రాష్ట్ర పరిస్థితిపై ఏర్పాటైన శ్రీకృష్ణ కమిటీకి తెలంగాణ కాంగ్రెసు సారధ్య బృందం గురువారం 111 పేజీల నివేదికను సమర్పించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తాము ఈ నివేదికను సమర్పించామని సారథ్య బృందం నాయకుడు నిరంజన్ మీడియా ప్రతినిధులతో చెప్పారు.
నిపుణులను, మేధావులను సంప్రదించి నివేదికను రూపొందించినట్లు ఆయన తెలిపారు. తెలంగాణకు అనుకూలంగా తాము నివేదికను రూపొందించినట్లు ఆయన తెలిపారు.