విశాఖపట్నం: విశాఖపట్నంలో ఒక అపార్టుమెంటు పై నుంచి దూకి దొంగ మరణించాడు. విశాఖపట్నంలోని ఓ అపార్టుమెంటులోని నాలుగో అంతస్తులో ముగ్గురు దొంగ తనానికి ప్రయత్నించారు. దీన్ని గమనించిన స్థానికులు వారిని వెంబడించే ప్రయత్నం చేశారు. దీంతో దొంగలు బాల్కనీ నుంచి కింది దూకారు. ముగ్గురిలో ఇద్దరు ప్రమాదం నుంచి బయటపడగా, ఒక దొంగ తల పగిలి మరణించాడు.