డిసెంబర్ 31లోగా పని పూర్తి చేస్తాం: శ్రీకృష్ణ

Srikrishna
న్యూఢిల్లీ: డిసెంబర్ 31వ తేదీలోగా తమ పని పూర్తి చేస్తామని జస్టిస్ శ్రీకృష్ణ చెప్పారు. రాష్ట్ర పరిస్థితులపై ఏర్పాటైన శ్రీకృష్ణ కమిటీ గురువారం సమావేశమైంది. గడువులోగా వినతిపత్రాలు సమర్పించాలని, ఈ గడువు పెంచుతూ పోతే తమ పని కష్టమవుతుందని ఆయన ఆయన చెప్పారు. ఏప్రిల్ 10వ తేదీలోగా ప్రజలు తమ సూచనలు, సలహాలు పంపుకోవచ్చునని తెలిపారు. ఇప్పటి వరకు 14వేలకు పైగా వచ్చాయని, వాటిని రోజువారీగా పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు.

ఏప్రిల్ 8వ తేదీన తిరిగి సమావేశమవుతామని, ఆ తర్వాత రాష్ట్రంలో సభ్యులంతా పర్యటిస్తారని, జులై వరకు ఈ పర్యటనలు సాగుతాయని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఏ విధమైన నివేదిక అవసరం లేదని ఆయన చెప్పారు. రాజీవ్ శర్మను నోడల్ ఆఫీసరుగా నియమించినట్లు ప్రకటించారు. ప్రభుత్వం తమకు సమర్పించే నివేదిక పబ్లిక్ డాక్యుమెంటు అని, ఎవరైనా ఆ డాక్యుమెంటును పొందవచ్చునని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+