చికాగో: భారత సంతతికి చెందిన వ్యక్తిని అమెరికాలో గుర్తు తెలియని దుండగులు కాల్చిచంపారు. కాన్సాస్ పట్టణంలోని ఓ నిత్యావసర వస్తువుల దుకాణంలోనికి బుధవారం రాత్రి ప్రవేశించిన దుండగులు క్యాషియర్‌గా పనిచేస్తున్న గుర్ ప్రీత్ సింగ్(35)ను కాల్చి డబ్బును దోచుకెళ్లారని పోలీసులు వెల్లడించారు.
దుండగులు ప్రవేశించిన విషయాన్ని సింగ్ తమకు ఫోన్ చేసి చెప్పారని, సంఘటనస్థలానికి చేరుకునేసరికి వారు పరారయ్యారని తెలిపారు. తీవ్రంగా గాయపడిన సింగ్ ఆసుపత్రిలో మరణించారు.