ఘనుడు రాజగోపాల్ కు సెలవు

వీరభద్రయ్య ప్రమేయం లేకుండా ఆయనకు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలుపుతూ కొంతమంది పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం కూడా వివాదాస్పదమైంది. ఆ ప్రకటనలు వెలువడిన మర్నాడే ప్రభుత్వం ఈ కీలక నిర్ణయాలను తీసుకుంది. సెలవు రోజు అయినా ఆదివారంనాడే సాయిరాంసింగ్ సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేయడం, రాజగోపాల్‌కు సెలవు మంజూరు చేస్తూ జీవోను జారీ చేయడం గమనార్హం. వ్యక్తిగత కారణాలపైనే నెల రోజులు తాను సెలవుపై వెళుతున్నట్లు రాజగోపాల్ అంటున్నారు. నిబంధనలు పాటించకుండా, ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం అందించకుండా మైనింగ్ కంపెనీలకు పర్మిట్లు జారీ చేసినందుకే అనంతపురం ఏడీ సాయిరాంసింగ్‌పై వేటు వేసినట్లు ప్రభుత్వం ఆయన సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొంది. అనంతపురం జిల్లా డీ హీరేహాల్ మండల పరిధిలోని ఆరు గనుల్లో తవ్వకాలను నిలిపివేస్తూ గత ఏడాది జనవరి 25న పరిశ్రమల శాఖ జీవో 723 జారీ చేసింది.
ఈనెల మూడో తేదీ నుంచి ఎలాంటి విధానం పాటించకుండా సాయిరాంసింగ్ డిస్పాచ్ పర్మిట్లు మంజూరు చేశారని ఆయన సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అక్కడ మైనింగ్, రవాణా చేస్తున్న విషయాన్ని ఆయన ప్రభుత్వ దృష్టికి తీసుకురాలేదని వివరించారు. సాయిరాంసింగ్ చర్యలు ప్రభుత్వం చర్యలకు భిన్నంగా ఉన్నాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సాయిరాంను సస్పెండ్ చేసినందున అనంతపురం ఏడీగా మరో అధికారికి అదనపు బాధ్యతలు అప్పగించే ఏర్పాట్లు చేయాలని గనుల శాఖ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. అయితే, గనుల శాఖ డైరెక్టర్ వీడీ రాజగోపాల్ సెలవుపై వెళుతుండడంతో ఆయన బాధ్యతలను జాయింట్ డైరెక్టర్ సుశీల్‌కుమార్‌కు అప్పగించినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications